Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thrithvamai Nithyathvamuna Nekathvamaga

త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగ

Thrithvamai Nithyathvamuna Nekathvamaga

Chorus
త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ సత్యసామర్థ్యత్వముల
నిజ తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను‖ త్రిత్వమై ‖
Verse
ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యుల్లమున నీ గొప్ప వింత
లెల్ల సంతసిల్ల శోభిల్లఁ దలంచెదను‖ త్రిత్వమై ‖
Verse
వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాధుండను
కుమారా దోషుల దోసంబులెల్లఁ గాచి రక్షించినావు‖ త్రిత్వమై ‖
Verse
ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము
నంపఁబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు‖ త్రిత్వమై ‖
Verse
ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుఁడవు ఎల్ల పాపులను రక్షింప
మిగుల నోపికతో నాపదలు బాపి కృపఁ జూపినావు‖ త్రిత్వమై ‖

Related Tags

PraiseWorshipTrinity