Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thrithvamarmamu Nerigina Mithrunda Praanamunimmu

త్రిత్వమర్మము నెరిగిన మిత్రుండా ప్రాణమునిమ్ము

Thrithvamarmamu Nerigina Mithrunda Praanamunimmu

Verse
త్రిత్వమర్మము నెరిగిన - మిత్రుండా ప్రాణమునిమ్ము
విలువ గలిగిన ప్రభుని - సిలువ భుజముపై మోసి
Verse
గోధుమ భూమిలోపడిన - బహుగాను ఫలియించును
మోదమున ప్రభుయేసునితో మరణించవలెను ప్రియుడా
Verse
మహిమ నొందుటకు నీవు సాత్వికుండవు కావలెను
మహిమ స్వరూపిని పోలి - నీవును జీవించవలెను
Verse
క్రీస్తును ప్రేమను త్రాగి - ఆత్మవశుడవైనచో
సైతాను సహవాసమును - సంపూర్ణముగా వదిలెదవు
Verse
పొలము దున్నెడువాడు - వెనుక తిరిగి చూడడు
ఇలలో నీవున్నను ప్రియుడా - యిలనే మరచిపోవలెను
Verse
ప్రాణంబు పోయినగాని - విశ్వాసము విడువ వలదు
ప్రియుడా నీదు ద్వారానే - పృథివి బాగుపడవలెను

Related Tags

DevotionalSacrificeChristian Life