Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thryaeka Dhaevuda Yehoava Dhaevu Nae Na

త్ర్యేక దేవుఁడ యెహోవ దేవు నే న

Thryaeka Dhaevuda Yehoava Dhaevu Nae Na

Lyricist: Marthanda Jnana Prakashamu
Verse
త్ర్యేక దేవుఁడ యెహోవ దేవు నే నమ్మి సేయుదు సేవ దేవ
పరలోక భూలోక ముల నెల్లఁ బుట్టించి పాలించు తండ్రి దే వుని
నమ్మెదను నేను‖ త్ర్యేక ‖
Verse
శ్రీ దేవసుతుఁ డేసు క్రీస్తే యేక చిరజీవ నాధుండు నాకే దేవ కన్య
మరియమ్మ గ ర్భమున జన్మించిన కరుణగల దేవునిఁ గూర్మితో నమ్మెదఁ‖ త్ర్యేక ‖
Verse
పొంతి పిలాతు కాలమున యేసు పొంది శ్రమలను సిలువమీద
దేవ కొట్టఁబడి చనిపోయి పెట్టఁబడి భూమిలో మూఁడవ దినమందు
మృతి గెలిచి లేచెను‖ త్ర్యేక ‖
Verse
పరలోకమున కెక్కె యేసు క్రీస్తు పరమతండ్రికిఁ గుడివైపు దేవ
సింహాసనముమీఁద స్థిరముగాఁ గూర్చుండి యున్నాఁడు చిరన్యాయ
కర్తయై యున్నాఁడు‖ త్ర్యేక ‖
Verse
అక్కడనుండి ప్రభు యేసు వచ్చు నిక్కముగఁ దీర్పుఁ దీర్చుటకు దేవ
మరణ మొందినవారికి బ్రతికి యున్నవారికి న్యాయంబుఁ దీర్చును
న్యాయవంతుఁడు యేసు‖ త్ర్యేక ‖
Verse
శుద్ధాత్మ దేవుని నేను మన శుద్ధితో నమ్మి కొల్చెదను దేవ శుద్ధ
సంఘంబు పరి శుద్ధుల సహవాస మును నమ్మెదను నిత్య మును నేను
నిజ మిది‖ త్ర్యేక ‖
Verse
పాపక్షమాపణను నేను ఎంతో బలముగా నమ్మెద నిలను దేవ ఈ
శరీరముపోయి యంత్యదినమున మరల లేచునని తిరముగా వాసిగా
నమ్మెదఁ‖ త్ర్యేక ‖
Verse
నిత్యజీవము నమ్మెదను నేను నిజముగా శ్రీ యేసు పేర దేవ నిత్యుండు
తండ్రి దే వుఁడు కుమారుండును ఆత్ముండు సత్యుండు త్ర్యేకుఁడౌ
దేవుండు‖ త్ర్యేక ‖

Related Tags

FaithTrinityCreed