Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udaya Sayanthramula Nellavelala Prabhuva

ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా

Udaya Sayanthramula Nellavelala Prabhuva

Chorus
ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా
నే ధ్యానించి పాడెదన్
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు
పాడుట వినబడుచుండున్
Verse
యెహోవాయే నాకు వెలుగు రక్షణయు
నేనెవరికి వెరతును?
యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె
శత్రువులు తొట్రిల్లిరి
Verse
యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు
యుద్ధము రేగినను దీనియందు నే
ధైర్యము విడువకుందున్
Verse
యెహోవా యొద్ద వర మొక్కటడిగితిని
దానిని వెదకు చున్నాను
యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున
ధ్యానించుటయే నా ఆశ
Verse
తన పర్ణశాలలో నను జేర్చి కాచును
నా ఆపత్కాలమునందు
తన గుడారములోన నను దాచియుంచును
దుర్గముపై నెక్కించున్
Verse
నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని
నీవు పల్కితివి గాన
నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను
నీ సముఖమును దాచకు
Verse
నా తల్లిదండ్రులు నన్ను విడచినను
యెహోవాయే చేరదీయున్
నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద
నీ కొరకు కనిపెట్టెదన్
Verse
యెహోవా నాకై యుద్దేశించినది
ఆయనయే నెరవేర్చును
మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల
కోరికలు నెరవేర్చును

Related Tags

WorshipPsalmTrust