Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udayamaaye Hrudayamaa

ఉదయమాయె హృదయమా

Udayamaaye Hrudayamaa

Lyricist: N Sanjay
Verse
ఉదయమాయె హృదయమా
ప్రభు యేసుని ప్రార్ధించవే‖ 2x ‖
పదిలముగా నిను వదలకుండా
పడక నుండి లేపెనే‖ 2x ఉదయమాయె ‖
Verse
రాత్రి గడచిపోయెనే
రవి తూర్పున తెలవారెనే‖ 2x ‖
రాజా రక్షకుడేసు దేవుని
మహిమతో వివరించవే‖ 2x ఉదయమాయె ‖
Verse
తొలుత పక్షులు లేచెనే
తమ గూటి నుండి స్తుతించెనే‖ 2x ‖
తండ్రి నీవే దిక్కు మాకని
ఆకాశమునకు ఎగిరెనే‖ 2x ఉదయమాయె ‖
Verse
పరిశుద్ధుడా పావనుండా
పరంధాముడా చిరంజీవుడా‖ 2x ‖
పగటియంతయు కాచి మము
పరిపాలించుము దేవుడా‖ 2x ఉదయమాయె ‖
Verse
తండ్రి దాతవు నీవని
ధరయందు దిక్కు ఎవరని‖ 2x ‖
రాక వరకు కరుణ చూపి
కనికరించి బ్రోవుమా‖ 2x ఉదయమాయె ‖

Related Tags

PraisePrayerMorning