Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udayinche Divya Rakshakudu

ఉదయించె దివ్య రక్షకుడు

Udayinche Divya Rakshakudu

Lyricist: Songs Of Zion
Verse
ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను‖ 2x ఉదయించె ‖
Verse
ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా‖ 2x ‖
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా‖ 2x ‖
మార్గదర్శియై నడిపించువారు‖ 2x ‖
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో‖ 3x ఉదయించె ‖
Verse
చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని‖ 2x ‖
పాపంబునుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు‖ 2x ‖
మానవాళికై మరణంబునొంది‖ 2x ‖
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను‖ 3x ఉదయించె ‖
Verse
పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్‖ 2x ‖
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు‖ 2x ‖
చీకటి నుండి దైవ వెలుగునకు‖ 2x ‖
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు‖ 3x ఉదయించె ‖

Related Tags

WorshipSalvationChristmas