Verse
ఉదయించినాడు చూడు నేస్తమా
లోక రక్షకుడు క్రీస్తేసుగా‖ 2x ‖
Verse
సర్వాధికారి ఆయెనే సర్వశక్తిమంతుడు
దీనుడై రిక్తుడై మనుష్యకుమారుడై‖ 2x ‖
నశియించినదానిని వెదకి రక్షించుట కొరకు వచ్చెను‖ 2x ‖
లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా
Verse
ఇమ్మానుయేలు దేవుడు ఎన్నడూ నిను విడువడు
మరువడు కునుకడు తోడుగా ఉండువాడు‖ 2x ‖
నలిగినవారికి దుర్గమై ఆశ్రయమిచ్చే అమరుడు‖ 2x ‖
చీకటి బ్రతుకులో వెలుగునింపుటకు నీతి సూర్యుడై
Verse
ప్రయాసపడుచు భారము మోయు సమస్త జనులరా
రండి దేవుని ఆశ్రయించుడి ఈ దినమందే‖ 2x ‖
మీ దోషములు అపరాధములు అన్నీ పోవును‖ 2x ‖
శాంతి నెమ్మది సమాధానము ఇచ్చే దయగల దేవుడు