Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udayinchinaadu naa jeevithaana

ఉదయించినాడు నా జీవితాన

Udayinchinaadu naa jeevithaana

Lyricist: Pastor V Joshua
Verse
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్య
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైన వారికి సమాధానము
మతిలేని నా జీవితాన్ని
మరువలేను నా యేసయ్య
మరియమ్మ గర్భాన జన్మించినాడు
మార్చెను నా బ్రతుకును నా యేసయ్య
గురిలేని ఈ యాత్రలోన
గుర్తించి నన్ను పిలిచెను
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను నిలుపుకుంటినే
గురిగా నేను చేసుకుంటినే
కష్టాల కడగండ్లలోన
కన్నీరు నే కార్చగా
కడతీర్చుటకు కరుణామయునిగా
ఇలలో నాకై ఏతెంచెను

Related Tags

WorshipJesusChristmas