Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udayinchinaadu Naa Jeevithaana

ఉదయించినాడు నా జీవితాన

Udayinchinaadu Naa Jeevithaana

Lyricist: Pastor V Joshua
Verse
ఉదయించినాడు నా జీవితాన
నా నీతిసూర్యుడు నా యేసయ్యా
నా నీతిసూర్యుడు నా యేసయ్యా‖ 2x ‖
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైన వారికిల సమాధానము‖ 2x ఉదయించినాడు ‖
Verse
మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా‖ 2x ‖
మరియమ్మ గర్భాన జన్మించినాడు
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా‖ 2x ‖
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా‖ ఉదయించినాడు ‖
Verse
గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను‖ 2x ‖
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను నిలుపుకుంటినే‖ 2x ‖
గురిగా నేను చేసుకుంటినే‖ ఉదయించినాడు ‖
Verse
కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా‖ 2x ‖
కడతేర్చుటకు కరుణామయునిగా
ఇలలో నాకై ఏతెంచెను‖ 2x ‖
ఇలలో నాకై ఏతెంచెను‖ ఉదయించినాడు ‖

Related Tags

WorshipJesusChristmas