Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udayinchinadu Kristundu Nedu Udayi

ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయి

Udayinchinadu Kristundu Nedu Udayi

Verse
ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయు
మరియ నందనుఁడై యిమ్మానులేల్ సదయుఁడై చెడియున్న పృధివికి
నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగన సాధు జనముల
హృదయముల ముద మెదుగునట్లుగ
Verse
ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు
మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనము పై తగ దేవుఁడును దా
నొక్కఁడు చిరజీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు నొడాఁబడి
Verse
యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి
ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మిదుఁ జూడని వారి కారుండ
వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ
డె దయాళుఁడు ప్రాణ మిడుటకు

Related Tags

PraiseChristmasIncarnation