Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Udhayinchinaadu Kristhudu Nedu

ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు

Udhayinchinaadu Kristhudu Nedu

Lyricist: Purushothamu Choudari
Verse
ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయౌ
మరియ నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై చెడియున్న పృథివికి
నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగను సాధు జనముల
హృదయముల ముద మెదుగునట్లుగ‖ నుదయించి ‖
Verse
ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు
మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా
నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు
నొడఁబడి‖ యుదయించి ‖
Verse
యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి
ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ
వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు
ప్రాణ మీడుటకు‖ నుదయించి ‖

Related Tags

ChristmasNativity