Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ullaasa Jeevitham Adi

ఉల్లాస జీవితం అది

Ullaasa Jeevitham Adi

Verse
ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది
ఉత్సాహమైనది అది నీతో నడచుటయే
కనుపాపే నీవయ్యా – కన్నీళ్లను భరియించి
కష్టాలలో కదిలొచ్చావా – నా కోసం యేసయ్యా‖ 2x ‖
నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి
నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి
కరుణే లేని కఠినుల మధ్య నన్నూ
కరుణించేవానిగా చేసావయ్యా యేసయ్యా
కాపరి లేని జీవిత పయణంలోనా
నా కాపరి నీవై కాపాడావా యేసయ్యా
నా కోసం బలి అయ్యావా – నీవు నన్నూ ప్రేమించి
నా మార్గం స్థిరపరిచావా – నా కోసం దిగి వచ్చి
నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి
నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి
నలిగిన నా జీవిత పయణంలోనా
నీ నవ్వును పుట్టించావా యేసయ్యా
నూతనమైన జీవిత మార్గంలోనా
నా పాదం నీతో నడిపించావా యేసయ్యా
నా కోసం ఏర్పరిచావా – పరలోకపు నివాసము
నా కోసం తిరిగొస్తావా – నీ కోసం వేచుంటా
నీవు నా కోసం తిరిగొస్తావా – నన్నూ ప్రేమించి
నా జీవిత పయనం – నీతోనే యేసయ్యా‖ 2x ‖

Related Tags

PraiseDevotionalJesus