Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ullasinchi Paata Paade Paavuramaa Mrudhu Madhura Sundara Naareemanee

ఉల్లసించి పాట పాడే పావురమా మృధు మధుర సుందర నారీమణీ

Ullasinchi Paata Paade Paavuramaa Mrudhu Madhura Sundara Naareemanee

Verse
మృధు మధుర సుందర నారీమణీ
ఎద పవళించు నా ప్రాణేశ్వరీ
ఒక్క చూపుతో నీవాడనైతి
ఒక్క పిలుపుతో నీ వశమైతి
పావురమా నా పావురమా
నా నిర్మల హృదయమా... నా పావురమా
Chorus
ఉల్లసించి పాటపాడే పావురమా
ఓ ఓ ఓ పుష్పమా.. షారోను పుష్పమా
వాగ్దానదేశపు అభిషేక పద్మమా
లెబనోను పర్వత సౌందర్యమా
Verse
పాలుతేనెలో పవళించి
పరిమళ వాసనలు విరజిమ్ము
జీవజలాలలో విహరించి
జీవఫలాలను ఫలియించు
ఉల్లసించి పాటపాడే పావురమా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా‖ ఓ ఓ ఓ పుష్పమా ‖
Verse
జల్ధరు వాసనలు శ్వాసించి
జగతికి జీవమును అందించు
సంధ్యారాగము సంధించి
సుమధుర స్వరమును వినిపించు
ఉల్లసించి పాటపాడే పావురమా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా‖ ఓ ఓ ఓ పుష్పమా ‖

Related Tags

PraiseWorship