Verse
ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు‖ 2x ‖
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన‖ ఉన్నాడు ‖
Verse
గాఢాంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగి తేలినా‖ 2x ‖
కరుణ లేని లోకము కాదన్ననూ‖ 2x ‖
కన్నీరు తుడుచును నను కొన్నవాడు‖ ఉన్నాడు ‖
Verse
యెహోవ సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును‖ 2x ‖
కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును‖ 2x ‖
బ్రతుకు కాలమంతయు హర్షింతును‖ ఉన్నాడు ‖