Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Unnaavu Devaa Yugayugamulu Unnavaada Neeve Tharatharamulu

ఉన్నావు దేవా యుగయుగములు ఉన్నవాడ నీవే తరతరములు

Unnaavu Devaa Yugayugamulu Unnavaada Neeve Tharatharamulu

Chorus
ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు
ఉందునన్నావు సదాకాలము
యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై‖ ఉన్నావు ‖
Verse
మోషేకు తోడై ఉన్నవాడనీవే
నీ జనుల నడిసంద్రాన నడిపించినావే‖ 2x ‖
అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే
ఆకాశమునుండి ఆహార మిచ్చితివే
బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే‖ ఉన్నావు ‖
Verse
సింహాల బోనులో దానియేలుతో
ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో‖ 2x ‖
ఐగుప్తునందున యేసేపుకు తోడై
ఆశీర్వదించి అధిపతిగ చేసితివే
శ్రమలలో నాతోడై వుందనన్నావే‖ ఉన్నావు ‖
Verse
కన్నీటి లోయలో కష్టాల కడలిలో
అద్దరికి చేర్చి నన్నాదు కొందువే‖ 2x ‖
నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే
నీ కంటి పాపలా కాపాడు దేవుడవే
ఇమ్మానుయేలువై నీవు నాకున్నావే‖ ఉన్నావు ‖

Related Tags

WorshipFaithfulnessGods Presence