Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Unnapaatuna Vachchu Chunnaanu Nee Paa

ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పా

Unnapaatuna Vachchu Chunnaanu Nee Paa

Lyricist: Purushothamu Choudari
Chorus
ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న
శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక
తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను‖ ఉన్న ‖
Verse
కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి
దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ
యిది మరి వేరే హేతువు లేదు నా యెడ‖ ఉన్న ‖
Verse
మసి బొగ్గువలె నా మా నస మెల్లఁ గప్పె దో ష సమూహములు
మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటుఁ గడిగి పవిత్ర్ర
పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని‖ ఉన్న ‖
Verse
వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె నెమ్మది దొల
గెను పలు విధములగు సందియంబుల వలనఁ బోరాటములచే నే
నలసి యిటునటుఁ గొట్టఁబడి దు ర్భలుఁడనై గాయములతో నిదె‖ ఉన్న ‖
Verse
కడు బీదవాఁడ నం ధుఁడను దౌర్భాగ్యుఁడను జెడిపోయి పడి
యున్నాను సుడివడిన నా మదికి స్వస్థతఁ జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ
బడయవలసిన వన్ని నీ చేఁ బడయుటకు నా యెడ యఁడా యిదె‖ ఉన్న ‖
Verse
నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గముఁ గంటిని
కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి
సంతోషావసరముల నిడుదువని యిదె‖ ఉన్న ‖
Verse
దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి విఱుగఁగొట్టెను గాన నే నిపు డరుదుగా నీ
వాఁడ నవుటకు మఱి నీవాఁడ నవుటకే‖ ఉన్న ‖

Related Tags

GraceRepentanceSurrender