Verse
ఉన్నత గృహమును త్వరగా చేరి
సంపన్నుని దర్శింతును - ఈ‖ ఈ ‖
పేదగు నా కోర్కె సఫలము చేసిన
నాథుని కొనియాడుదున్
Verse
దూతల మధ్యను స్తోత్రము లొందెడు
ప్రభుని స్తోత్రింతును - సు‖ సు ‖
గంధము వీచెడి పుష్ప రాజంబుల
మధ్యను నిద్రింతున్
Verse
ఆకాశ గణములు సేవించుచుండగ
వీకతో వారిజేరుదున్ - నా‖ నా ‖
యేసుని స్తుతుల నోరార పాడి
భాసురముగ నుతింతున్
Verse
స్ఫటిక నది తీరమున నేను
పాడుచు తిరుగుదును - ఆ‖ ఆ ‖
బంగారు వీధిలో యేసుతో నేను
రంగుగ నడుగిడుదున్
Verse
పలువిధ మృగములు పైబడినను
నెవ్విధమున భయపడను - ఆ‖ ఆ ‖
వెంగియు సింహము నాపై వచ్చిన
నగవుతో రమ్మనెదన్
Verse
పక్షులు అయ్యెడ ననేకముండును
వృక్షఫలములుండున్ - నా‖ నా ‖
రక్షకుడగు యేసు నాకై చేర్చిన
అక్షయ ధనముండున్
Verse
పేతురు యోహాను పౌలుతో నేనును
ప్రీతితో వసియింతును - నా‖ నా ‖
చల్లని మిత్రుని ఇంటను హర్షముతో
హల్లెలూయ పాడెదను