Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Unnatha Sthalamulalo

ఉన్నత స్థలములలో

Unnatha Sthalamulalo

Verse
ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి
నా శ్రమ దినములలో – కృపలతో కాచితివి‖ 2x ‖
స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడా
మహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా‖ 2x ‖
Verse
ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టి
తల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి‖ 2x ‖
నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపిన
లేని అర్హతలను నాకు వరముగా చేసిన‖ 2x ఉన్నత ‖
Verse
కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండా
నీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా‖ 2x ‖
శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపిన
హీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన‖ 2x ఉన్నత ‖
Verse
గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినా
పదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా‖ 2x ‖
నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగా
ఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా‖ 2x ఉన్నత ‖

Related Tags

PraiseWorshipGrace