Verse
ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
ఎన్నతగిన మహారక్షణ శిఖరము
సుందర మొందు సదా‖ 2x ‖
Verse
మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె
మరణపు ముల్లును విరచి జయంబును
యేసు అనుగ్రహించెన్‖ 2x ‖
Verse
ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో
దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచి
సంతస మొందెదరు‖ 2x ‖
Verse
ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయును
నిశ్చయముగా బహు బుద్ధివివేకము
లిచ్చి నడుపు సదా‖ 2x ‖
Verse
చంచల హృదయులును - ముష్కరులగు పాపులును
వంచనలేక వాక్యమునకు
తలవంచి విధేయులౌదురు‖ 2x ‖
Verse
కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను
నడువుడి త్రోవయిదే యను శబ్దము
చెవులకు వినబడును‖ 2x ‖
Verse
పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతి
రక్షణ కర్త యెహోవా నిన్ను
కాచి రక్షించు సదా‖ 2x ‖
Verse
సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు
అందమైన యా పరలోక రాజ్యము
ప్రబలుట చూచెదవు‖ 2x ‖