Chorus
పల్లవి: ఉన్నతమైన స్థలములలో - ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా‖ ఉన్నత ‖
Verse
చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా‖ ఉన్నత ‖
Verse
పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు
జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా‖ ఉన్నత ‖
Verse
మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము - భారము తోడ ప్రకటించెదము‖ ఉన్నత ‖