Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Unnattu Naenu Vachchedhan Paapinaina Nan Pilvagan

ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపినైన నన్ పిల్వగన్

Unnattu Naenu Vachchedhan Paapinaina Nan Pilvagan

Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపినైన నన్ పిల్వగన్
నీ నెత్రుచేత గడుగుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్
నీ మాటలతో హరించుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చగన్
పాపంబు బాయ నీయొద్ద - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్ - కబోధినై నేనుండగన్
ఆత్మీయ దృష్టి నీయుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్
మన్నించి చేర్చుకొనయా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్
నీవాడనౌదు సర్వదా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

Related Tags

GospelRepentance