Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్
పాపిష్ఠు న్నీవు పిల్వఁగన్
నీ నెత్రుచేతఁ గడ్గుమా
యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్
నే నొప్పుకొందుఁ దప్పులన్
నీ మాటతో హరించుమా
యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్
దుఃఖంబు బాధపర్చఁగన్
బాపంబుఁ జేయనీకుమా
యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్
యేసూ, కబోది నుండగన్
ఆత్మీయదృష్టి నీయుమా
యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్
నీ మాట నమ్మునట్టి నన్
మన్నించి చేర్చుకొమ్మయా
యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
Verse
ఉన్నట్టు నేను వచ్చెదన్
నీ ప్రేమ నన్నుఁ బిల్వగన్
నీ వాఁడ నౌదు సర్వదా
యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!