Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Unnavaadavu Anuvaadavu Neevu

ఉన్నవాడవు అనువాడవు నీవు

Unnavaadavu Anuvaadavu Neevu

Lyricist: Smt Kiranmai Paul
Verse
ఉన్నవాడవు అనువాడవు నీవు
నిన్న నేడు నిరతము మారని మా యేసయ్యా
అల్ఫయు ఓమేగాయు నీవే కదా
ఆద్యంతా రహితుడవు నీవే కదా‖ 2x ‖
హల్లెలూయా స్తోత్రార్హుడా
యుగయుగములకు స్తుతిపాత్రుడా‖ 2x ‖
Verse
పలుకబడిన వాక్కుతో
ప్రపంచములు నిర్మించితివి
మంటితో మము చేసి
జీవాత్మను ఊదితివి‖ 2x ‖
మమ్మునెంతో ప్రేమించి
మహిమతో నింపితివి
పరము నుండి దిగివచ్చి
మాతో నడచితివి
Verse
పాపమంటియున్న మాకై
మా పరమ వైద్యునిగా
నీ రుధిరం నాకై కార్చి
ప్రాయశ్చిత్తం చేయగా‖ 2x ‖
మొదటివాడా కడపటివాడా
జీవింపచేసితివే
నీదు ఆత్మతో నింపితివే
మమ్ము సరిచేసితివే
Verse
ప్రతివాని మోకాలు
వంగును నీ నామమున
ప్రతివాని నాలుక
చాటును నీ మహిమను‖ 2x ‖
తరతరములకు మమ్మేలువాడా
భూపతుల రాజువే
మేఘారూడుడై దిగివచ్చి
మహినేలు మహారాజువే

Related Tags

PraiseWorship