Verse
ఉపవాసంతో ప్రార్ధనలో
నీ వైపే చూస్తున్నా దేవా
మోకాళ్లపై కన్నీటితో
నే చేయు ప్రార్ధన వినుము దేవా
అడిగిననూ ఇయ్యవా దేవా
వెదకిననూ దొరకవా దేవా
తట్టిననూ తీయవా దేవా
యేసయ్యా విను నా ప్రార్ధన‖ ఉపవాసంతో ‖
Verse
నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా
నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య‖ 2x ‖
దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా‖ 2x ‖
రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా‖ 2x అడిగిననూ ‖
Verse
జీవించు కాలమంతా నీ సేవ చేయాలి
నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా‖ 2x ‖
నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా‖ 2x ‖
రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా‖ 2x అడిగిననూ ‖