Verse
ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును
Chorus
సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో..‖ 2x ‖
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో‖ 2x ఉతక ‖
Verse
చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు‖ 2x ‖
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును‖ 2x సోమరీ ‖
Verse
చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు‖ 2x ‖
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును‖ 2x సోమరీ ‖
Verse
చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా‖ 2x ‖
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును‖ 2x సోమరీ ‖
Verse
తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును‖ 2x ‖
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును‖ 2x సోమరీ ‖
Verse
ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో‖ 2x ‖
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది‖ 2x సోమరీ ‖