Verse
వాడబారని విశ్వాసముతో
శుభప్రదమైన నిరీక్షణతో‖ 2x ‖
వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా‖ 2x ‖
యేసయ్యా
నీ రాక కోసమై – కడబూర శబ్దముకై
నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై‖ 2x వాడబారని ‖
Verse
మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై
బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై‖ 2x ‖
సిద్ధపడియున్న వధువునై
ఆశతో వేచానయ్యా‖ 2x నీ రాక ‖
Verse
లేఖనములను చూచితి – గురుతులు గమనించితి
ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి‖ 2x ‖
రారాజువై నీవు రావాలని
ఎదురు చూచుచున్నానయ్యా‖ 2x నీ రాక ‖
Verse
నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన
ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా‖ 2x ‖
లోక బంధాల నుండి
నీ చెలిమి కోరానయ్యా‖ 2x నీ రాక ‖