Verse
వాడుకో… యేసయ్యా….
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా
నీ కాడి నే మోస్తానయ్యా‖ 2x ‖
Verse
వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో‖ 2x ‖
వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా‖ 2x వాడిపోక ‖
Verse
నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే‖ 2x వాడుకో ‖
Verse
నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే‖ 2x వాడుకో ‖
Verse
నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే‖ 2x వాడుకో ‖
Verse
నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
నాకున్న అవకాశం చేజారి పోకముందే‖ 2x వాడుకో ‖