Verse
వాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యం
పాపమెంచని ఆంతర్యం – నీతో.. వీడదీయని సాంగత్యం
దయచేయుమా నాకు నా యేసయ్యా
సరిచేయుమా నన్ను నా యేసయ్యా
వాడుకో నా యేసయ్యా
అని వేడుకుంటున్నానయ్యా‖ 2x ‖
రాజా రాజా రాజుల రాజా
రాజా రారాజా నా యేసు రాజా‖ 2x ‖
Verse
ఏలియా ప్రవక్త
యోర్దాను నదీ సమీపమున
ఆహారమే లేకయుండగా
ఆ మహా కరువు కాలమున‖ 2x ‖
కాకోలముచే ఆహారమును పంపిన దేవా‖ 2x ‖
కాకోలాన్నే వాడిన దేవా
కడుహీనుడనైన నన్నును కూడా‖ వాడుకో ‖
Verse
బెయేరు కుమారుడు బిలాము
దైవాజ్ఞను మీరగా
మోయాబుకు పయనమైన వేళ
తన నేత్రాలు మూయబడగా‖ 2x ‖
గాడిదకు మాట్లాడుటకు పలుకిచ్చిన దేవా‖ 2x ‖
గాడిదనే వాడిన దేవా
గతిలేనివాడను నన్నును కూడా‖ వాడుకో ‖