Verse
వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు‖ 4x ‖
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానముల్ నా సొంతమేగా‖ 4x ‖
Verse
కన్నీటిని తుడచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు‖ 2x ‖
ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు‖ 2x ‖
నా నీతివలన కానీ కాదయ్యా
అంతా నీ నీతి వలనేనయ్యా‖ 2x నేను జడియను ‖
Verse
కృంగిపోక నే సాగిపోదును
నీ కృప నా తోడున్నదిగా‖ 2x ‖
అది ఇరుకైననూ విశాలమైననూ‖ 2x ‖
విస్తారమైన కృప ఉండగా
నే అలయక సాగెదనయ్యా‖ 2x ‖
Verse
నే అలయక సాగెదనయ్యా…
అది ఇరుకైననూ విశాలమైననూ‖ 2x ‖
నా యేసయ్య తోడుండగా
నే అలయక సాగెదనుగా‖ 2x నేను జడియను ‖