Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaagdhaanamulu Pomdhudi Meeloa Prathivaadunu Vishvaasamu Chaethanu Oarputhoada Neppudu

వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు

Vaagdhaanamulu Pomdhudi Meeloa Prathivaadunu Vishvaasamu Chaethanu Oarputhoada Neppudu

Verse 1
Reference: మీ సంతోషము పరిపూరంగమగునట్లు అడుగుడి యోహాను John 16:24
Reference: మీరు నన్ను శోధించుడి మలాకీ Malachi 3:10
Reference: యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి కీర్తనలు Psalm 34:8
Chorus
వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును
విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు
Verse
ఇదివరకు మీరెవ్వరైనను - క్రీస్తు పేరట అడుగలేదుగదా
మదినెంతో నిండు సంతోషముపొంది - అడుగుడి దొరుకు మీకు
Verse
తన మహిమ ఐశ్వర్యము చొప్పున - నివ్వ క్రీస్తు యేసు కోరియుండ
మీ నేత్రములు పరమువైపు త్రిప్పి - అడుగుడి దొరుకు మీకు
Verse
దేవుని మందిర నిధిలోనికి - దశమ భాగములెల్ల తెండు
దీవెనలు క్రుమ్మరించు నిక్కముగ - శోధించుడి దేవుని
Verse
ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదా
ఆయనకు అర్పణం నర్పించి - శోధించుడి దేవుని
Verse
యెహోవా నాశ్రయించు వారికి - ఎట్టిమేలు కొదువై యుండదు
యెహోవా ఉత్తముడని నమ్ముడి - రుచించి గుర్తించుడి
Verse
దీనుడైన నీవు మొరపెట్టగా - శ్రమలలోనుండి రక్షించెదనిన్ను
తన నామమందు నమ్మిక యుంచి - రుచించి గుర్తించుడి
Verse
పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెను
నేటినుండి సముద్రపుటలలను - పోలి నీ నీతియుండు

Related Tags

FaithPrayerPromisePatience