Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaakyamey Shareeradhari ayye

వాక్యమే శరీరధారి అయ్యె

Vaakyamey Shareeradhari ayye

Lyricist: Elohim Music
Verse
వాక్యమే శరీరధారి అయ్యె
లోక రక్షకుడు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
రక్షకుడు భువికేతెంచెను
ఊరువాడ వీధులలో లోకమంత సందడంట
పాడెదము కొనియాడెదము
అరే పూజించి ఘనపరచెదమ్
Chorus
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
రాజు పుట్టినాడు యేలోయేలేలో
కొలవాపోదామా యేలో
Verse
గొఱ్ఱెలు విడచి మందను మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ
గానములతో గంతులు వేస్తూ,
గగనాలంటేల ఘనపరచెదమ్
చీకటిలో కూర్చున వారి కోసం
నీతి సూర్యుడేసు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
పరమును చేర్చను అరుదించే
Verse
ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంత సందడి చేద్దామ్
Chorus
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
పొలమును విడచి యేలోయేలేలో
పూజ చేద్దామా యేలో
తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్యభారమున్న
తనయుడెవరో చూడ వచ్చామమ్మ
బంగారు సాంబ్రాణి బోళములు
బాలునికి మేము అర్పించాము
మా గుండెలో నీకే నయ్య ఆలయం
మా మదిలో నీకే నయ్య సింహసనం
Verse
ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము,
జగమంత సందడి చేద్దామ్
Chorus
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
జ్ఞానాదీప్తుడమ్మ యేలోయేలేలో
భూవికెత్తించేనమ్మ యేలో
Bridge
నీవేలే మా రాజు
రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము
హొసన్నా పాటలతో
మా హృదయములర్పించి
హృదిలో నిన్ను కొలచి
క్రిస్మస్ నిజ ఆనందం
అందరము పొందెదము.

Related Tags

WorshipChristmasCelebration