Verse
వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక
వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక
Verse
దేశనివాసుల చెడుగును బట్టి - నదుల నడవిగ జేసెను
నీటి బుగ్గల నెండిన నేలగాను మార్చెను
Verse
అడవిని నీటిమడుగుగా - మార్చివేసె నెహోవా
ఎండిన నేలను నీటి - ఊటగాను మార్చెను
Verse
పురములు నివాసమునకై - వారేర్పరచుకొనునట్లు
పొలములలో విత్తనములు చల్లి - ద్రాక్షాతోటలు నాటిరి
Verse
సస్య ఫల సమృద్ధి పొందు - నట్లు వాటివలన
ఆయన ఆకలిగొనిన వారిని - అచ్చట కాపురముంచెను
Verse
మరియు ఆయన వాని నధికము - గా నాశీర్వదించగా
వారి సంతానాభివృద్ధి - అధికముగా వర్ధిల్లెను
Verse
వారు విచార బాధ వలన - తగ్గిపోయినపుడు
రాజులను తృణీకరించి - ఎడారిలో తిరుగజేసె
Verse
అట్టి దరిద్రుల బాధను బాపి - వారిని లేవనెత్తెను
అట్టివారి వంశము మంద - వలె వృద్ధిచేసెను
Verse
యధార్థవంతులు దాని - చూచి సంతోషింతురు
మోసము చేయువారందరు - మౌనముగా నుందురు
Verse
బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించును
యెహోవ కృపాతిశయముల - దలంచెదరు గాక