Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaare manchi kraisthavulu gadaa yee la

వారె మంచి క్రైస్తవులు గదా యీ ల

Vaare manchi kraisthavulu gadaa yee la

Verse
వారె మంచి క్రైస్తవులు గదా యీ లోకమందు వారె మంచి క్రైస్తవులు
గదా చేరునట్లు చేయుడి. పారమార్థమైన క్రీస్తు సారవాక్య మనుభవించు
వారి దారి గోరి జేరి భూరిసుఖముఁ బడయునట్టి‖ వారె మంచి ‖
Verse
కపట వేష భాష లెల్లను తొలంగఁ ద్రోచి విపుల భక్తి నిపుణు లగుచును
లపితములు నసత్యములును శపధములును లేక దేవ కృప మనంబులోన
వెలిగి యుపరిభాగ మరియునట్టి‖ వారె మంచి ‖
Verse
నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన సమ్మతంబు గలిగి మెండుగా
క్రమ్ము కొనెడి శ్రమలయందు సొమ్మసిలక ప్రభుని పా దమ్ములందు
బుద్ధి నిలిపి నెమ్మది గలవార లెవరో‖ వారె మంచి ‖

Related Tags

DevotionalChristian Life