Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaaru Aayana Thattu Choodagane Vaariki Velugu Kaligenu

వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగెను

Vaaru Aayana Thattu Choodagane Vaariki Velugu Kaligenu

Chorus
వారు ఆయన తట్టు చూడగానే - వారికి వెలుగు కలిగెను
Verse
కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు
కాపాడును మనల ప్రతి శోధన నుండి
చూపించు తన మహిమ నిత్యము మనకు
స్థాపించును మనలను తన రాజ్యముగా
Verse
కనుగొంటివా నీవు దేవుని మహిమ
తన కుమారుడైన యేసు ప్రభువులో
తన ప్రజలను విడిపింప క్రీస్తేసు
తనయుండై యిహమున జన్మించెను
Verse
అంత్య దినంబు వచ్చుచుండెను చూడు
చింతించెదరు పాపులందరిలలో
చింతించుచు నేడే పశ్చాత్తాపముతో రా
వింత రక్షణను పొంది ఆనందింతువు
Verse
యెహోవా తేజస్సు ఆయన శక్తితో
మహిమతో మందిరము నిండి యుండెను
మహామహుని పాదముల నేడే వేడిన
మహిమానందము పొంది సంతసింతువు
Verse
క్రీస్తు యేసు ప్రజలకు యీ భువిని
నీతి సూర్యుడు ఉదయించును మెండుగా
అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును
నిత్యము సంతోష గానము చేతురు
Verse
రక్షింపబడిన ప్రభుని జనమా
రక్షకుడేసుని స్వకీయ ధనమా
రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంఘమా
ముక్తి దాతను శ్లాఘించి కొనియాడుము

Related Tags

WorshipGraceSalvation