Verse
వారు భాగ్యవంతు లౌదురు భూ లోకమందు వారు భాగ్యవంతులౌదురు
చారు శుభవార్తా రవంబు గోరి యాకర్ణించి భక్తి మీరఁ దెలిసికొనిన
యట్టి ధీరు లెవ్వ రెవ్వరో‖ వారు ‖
Verse
వారు నడుచు మార్గమందున సుక్షేమ రాజి వారి ననుసరించు నెందును
తేరి చూడ రాని దే దీప్యమాన దివ్యసత్య భూరి తేజ మాజనములఁ
బొలుపు మీరఁ జుట్టుకొనును‖ వారు ‖
Verse
విమోచకుని నామమందున దజ్జనంబుల విశ్రుతానందంబు ప్రాణముల
అమందముగ హెచ్చరించు నతని నీతి రీతిఁ దజ్జ నముల కోర్కె వృద్ధి
బొం దంగఁ జేయు సంతతంబు‖ వారు ‖
Verse
నరులపై బిశాచమును నిందా స్థాప నంబు జేయంగలేదు పరగు
ప్రకాశమును బ్రాపు నైన సర్వే శ్వరుఁడు బలము రక్షయు న వారితముగ
మనకు నిచ్చు‖ వారు ‖
Verse
వరగుణ ప్రశస్తులారా క్రైస్తవులారా వన్నె మీర మీ రాజు
సురుచిరముగ శాశ్వతముగఁ పరిపాలించు మీ దేవుఁడు నిరతముగను
జీవించు నీతి భరిత చిత్తుఁడగుచు‖ వారు ‖