Verse
వారు ధన్యు లైన పిల్లలు భూలోకమందు వారు ధన్యులైన పిల్లలు
కోరి విచారమును ప్రభుని సార వాక్య మెదను బెట్టి వారి వారి కితరులైన
వారికిని విధేయులైన‖ వారు ‖
Verse
అన్నదములందు నెటులను తనతోడ నాడు చున్న యితరులందు
నటులను భిన్న మెంచ కొక్కరీతిఁ దన్నుఁబోలె ప్రియ మొనర్చి తిన్నని
బడియందు నేర్చు చున్నవార లెవ్వరో‖ వారు ‖
Verse
ఒక్కఁడె తండ్రి యతఁడు దేవుఁడు మన కందరకును సకల సుఖములిచ్చు
నెప్పుడు అకట మన మిఁకను జగడము లాడఁదగదు ప్రభుని రీతి
నొకని నొకఁడు ప్రియము చేసి యుండుద మని తలఁచుచుండు‖ వారు ‖
Verse
మంచి మేలు లనుభవింపఁగఁ గరుణించి దేవుఁ డెంచి మనల నిచటఁ
గూర్చెఁగ వంచనలఁ ద్యజించి కనిక రించి యొకనినొకఁడు మది స
హించి మంచి క్రియలతో వ ర్తింప నిశ్చయింతు రెవరో‖ వారు ‖
Verse
ఆకసమున నున్న దేవుఁడు మన మనసు రాక పోక లన్ని చూచు
నెప్పుడు ఏకముగా హృదయములు వి వేకమున వెలుంగఁ జేసి
ప్రాకాటముగఁ బ్రభుని యాజ్ఞ గైకొనియెడి వార లెవరో‖ వారు ‖