Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaati Vaati Kaalamuna

వాటి వాటి కాలమున

Vaati Vaati Kaalamuna

Lyricist: S J Berchmans
Verse
వాటి వాటి కాలమున అన్నిటిని
అతి మనోహరముగా చేయువాడా‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా..
నా దైవం నీవేనయ్యా‖ 2x వాటి వాటి ‖
Verse
ఆశ భంగం కానేరదు
మంచి రోజు ముందున్నది‖ 2x ‖
సత్క్రియను ఆరంభించెను
ఎటులైన చేసి ముగించును‖ 2x ‖
(నే) రూఢిగా నమ్ముచున్నాను
ఎటులైన చేసి ముగించును‖ 2x యేసయ్యా ‖
Verse
అద్భుతములు చేసెదను
నీ తోడుంటానంటివి‖ 2x ‖
నా ప్రజల ఎదుట నీవు
(నను) హెచ్చింప చేసెదవు‖ 2x ‖
(నే) రూఢిగా నమ్ముచున్నాను
హెచ్చింప చేసెదవు‖ 2x యేసయ్యా ‖
Verse
ఇప్పుడున్న వాటి కంటే
వెయ్యి రెట్లు చేసెదవు‖ 2x ‖
ఆకాశ తార వలె
భువిలో ప్రకాశింతును‖ 2x ‖
(నే) రూఢిగా నమ్ముచున్నాను
భువిలో ప్రకాశింతును‖ 2x యేసయ్యా ‖

Related Tags

FaithEncouragementHope