Verse
వచ్చాడు మహారాజు మరి మనకోసమే అండగా తోడుగా
శకపురుషుడు మహిమాన్వితుడు
మా రారాజతడు.. ఓహో..
Verse
వేవేల దూతల స్తుతులతో
నిత్యము కొనియాడబడుచు
పరిశుద్ధుడు అతి పరిశుద్దుడు అని
నిత్యము కీర్తీంచబడుచు
మహిమాన్వితుడు మహనీయుడు
మారని నిజదేవుడు
మన కోసమే మహిమను విడిచి
భువికే రక్షణను తెచ్చాడు
Verse
మాట తోనే సృష్టిని చేసిన ఎంతో గొప్ప దేవుడు
మంటి తోనే మనిషిని చేసిన ఎంతో మహనియుడవు
తన స్వహస్తాలతో తన స్వాస్తముగా
మము కాచి పెంచి ప్రేమిస్తున్న ఏకైక దేవుడు
నరులను ప్రేమించి పరమును విడిచి మనిషిగా పుట్టినాడు
మరణము గెలిచి రక్షణనిచ్చి మార్గము చూపినాడు
నీ హృదయము కోరాడు మరి ఏమి అడగలేదు
మారుమనసు పొంది మనము మోక్షమే చేరేదము