Verse
వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను
హెచ్చైన శుభముల నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని న్నెచ్చు
జేయునటంచు‖ వచ్చి ‖
Verse
భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా
రయముగ నిదిగోగ ర్భముఁ దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర
తని కిడు మంచును‖ వచ్చి ‖
Verse
అతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో న్నతుఁడైన దైవకుమారుఁడై
హిత మొప్పు దేవుండు న్నతిఁ జేసి దావీదు వితత సింహాసన మతని
కిచ్చునంచు‖ వచ్చి ‖
Verse
ఘనతరుఁడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము
వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాతఁ డనుంచుఁ
దె ల్పెను దూత మరియతో‖ వచ్చి ‖