Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vachchindi Christmas Vachchindi

వచ్చింది క్రిస్మస్ వచ్చింది

Vachchindi Christmas Vachchindi

Verse
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరూ వాడా పల్లె పల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే‖ 2x ‖
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను‖ 2x ‖
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం‖ 2x వచ్చింది ‖
Verse
దావీదు పట్టణములో
బేత్లెహేము గ్రామములో
కన్య మరియ గర్భమునందు
బాలునిగా జన్మించెను‖ 2x ‖
అంధకారమే తొలగిపోయెను
చీకు చింతలే తీరిపోయెను‖ 2x మన చీకటి ‖
Verse
ఆకాశంలో ఒక దూత
పలికింది శుభవార్త
మన కొరకు రక్షకుడేసు
దీనునిగా పుట్టాడని‖ 2x ‖
పాప శాపమే తొలగించుటకు
గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు‖ 2x మన చీకటి ‖

Related Tags

ChristmasCelebration