Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vachchunu Kreesthu Vachchunu Bhooloka

వచ్చును క్రీస్తు వచ్చును భూలోక

Vachchunu Kreesthu Vachchunu Bhooloka

Lyricist: Ravuri Lakshmayya
Chorus
వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును క్రీస్తు వచ్చును
చెచ్చెరను మేఘములపె రవ మిచ్చు బూర సునాదములతో హెచ్చుగను
దూతస మూహము లచ్చుగను సేవింపగ్రక్కున‖ వచ్చును ‖
Verse
అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె
సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను‖ వచ్చును ‖
Verse
ఒనరగనుఁదన మేఘ సింహా సనముపైఁ గూర్చుండి పావన జనుల
బారుల నిరుపార్శ్వము లను విభజనముఁ జేయు నిక్కము‖ వచ్చును ‖
Verse
అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక
మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లఁగ‖ వచ్చును ‖
Verse
అమిత పాపాత్ముల నరకలో కమునఁ బడవైచి సుజన సమూ హముల
దనవెను వెంటఁ గొని చను విమల నిత్య కిరీటము లొసఁగఁ‖ వచ్చును ‖
Verse
తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి
నొక్కరు నెల్లకాలము జూడని గడియ‖ వచ్చును ‖

Related Tags

Second ComingEnd TimesJesus Christ