Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vachhindi Vachhindi Madhuramaina Samayam

వచ్చింది వచ్చింది మధురమైన సమయం

Vachhindi Vachhindi Madhuramaina Samayam

Chorus
వచ్చింది వచ్చింది మధురమైన సమయం
తెచ్చింది నూతన కాంతుల ఉదయం
రావయ్యా వరుడా (రావమ్మా వదువా) సుస్వాగతం
నీకోసమే ఈ స్వాగత గీతం
Verse
మల్లెలు పరిమళం చల్లినవేళ
అల్లరి తెమ్మెర తాకినవేళ‖ 2x ‖
వెల్లువై ఆనందం పొంగిన వేళ
మెల్లగ నీ పాటి దరిచేరగా‖ 2x రా ‖
Verse
కోయిల గానాలు వినిపించువేళ
కోరిన ఘడియలు ఎదురైనవేళ‖ 2x ‖
చామంతులే పలకరించినవేళ
చేయందుకొని సతిని స్వీకరించగా‖ 2x రా ‖
Verse
పరలోక వాకిళ్లు తెరచుకొన్నవేళ
పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ‖ 2x ‖
మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ
వినయముగా నీ ప్రియుని సంధించగా‖ 2x రా ‖

Related Tags

CelebrationMarriageWedding