Chorus
వాడబారని విశ్వాసముతో
శుభప్రదమైన నిరీక్షణతో‖ 2x ‖
వేచియున్నానయ్యా...
కనిపెట్టుచున్నానయ్యా...యేసయ్యా‖ 2x ‖
నీ రాకకోసమై కడబూర శబ్దముకై
నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై
వాడబారని‖ వాడబారని ‖
Verse
మోకాళ్ళపై వేచితీ...
కన్నీళ్ళ పర్యంతమై...
బీడు బారిన నేల వానకై...‖ 2x ‖
యెదురుచూచిన చందమై...
సిధ్ధపడియున్న వధువునై...
ఆశతో వేచానయ్యా...యేసయ్యా‖ 2x నీ రాకకోసమై ‖
Verse
లేఖనములను చూచితి....
గురుతులు గమనించితీ....
ప్రవచన నెరవేర్పులన్నీ....‖ 2x ‖
జరుగుట గుర్తించితీ....
రారాజువై నీవు రావాలనీ...
యెదురుచూచు చున్నానయ్యా.....‖ 2x ‖
యేసయ్యా
నీ రాకకోసమై‖ నీ రాకకోసమై ‖
Verse
నీతి కొరకై వేచినా
గూడబాతును పోలిన
ఆత్మ దాహము తోడ నిండి‖ 2x ‖
అల్లాడుచున్నానయ్య........
లోక బంధాల నుండి
నీ చెలిమి కోరానయ్యా......‖ 2x నీ రాకకోసమై ‖