Chorus
వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు
తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో‖ వద్దు ‖
Verse
చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు
మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక‖ వద్దు ‖
Verse
నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ
యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో‖ వద్దు ‖
Verse
ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి
కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక‖ వద్దు ‖
Verse
బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు
యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక‖ వద్దు ‖
Verse
పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను
కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక‖ వద్దు ‖
Verse
మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు
ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక‖ వద్దు ‖