Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vaelpulaloa Bahughanudaa Yaesayyaa

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా

Vaelpulaloa Bahughanudaa Yaesayyaa

Chorus
వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
నిను సేవించువారిని ఘనపరతువు‖ 2x ‖
నిను ప్రేమించువారికి సమస్తము
సమకూర్చి జరిగింతువు. . . .
నీయందు భయభక్తి గల వారికీ
శాశ్వత క్రుపనిచ్చేదవు. . . .‖ వేల్పులలో ‖
Verse
సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు‖ 2x ‖
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో‖ 2x వేల్పులలో ‖
Verse
ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో
ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు‖ 2x ‖
విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో
నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో‖ 2x వేల్పులలో ‖
Verse
పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతో
ఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు‖ 2x ‖
పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు
చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను‖ 2x వేల్పులలో ‖

Related Tags

PraiseWorship