Verse
నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా
Verse
ఆకలితో నే అలమటించినప్పుడు
అక్కరనెరిగి ఆదుకొన్నావు‖ 2x ‖
వందనం యేసయ్యా
నీకే వందనం యేసయ్యా
నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా
Verse
ఊహించలేని ఆశ్చర్య కార్యములతో
ఏ కొదువ లేక నను కాచుచుంటివి‖ 2x ‖
కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా
నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు‖ 2x వందనం ‖
Verse
తప్పిపోయినా త్రోవ మరచినా
నీ కృప నన్ను విడచి వెళ్ళదు‖ 2x ‖
నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు‖ 2x ‖
యేసయ్యా..
నా ప్రతి విన్నపం
నీ చెంత చేరునేసయ్యా – యేసయ్యా
నా ప్రతి ప్రార్థనకు
జవాబు నీవే యేసయ్యా – యేసయ్యా‖ 2x ‖
Verse
వందనం యేసయ్యా
నీకే వందనం యేసయ్యా
ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై
యేసయ్యా… వందనం