Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vandanam Bonarthumo Prabho Prabho

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో

Vandanam Bonarthumo Prabho Prabho

Lyricist: Matthayi Samuyelu
Chorus
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముఁడా వదనంబు లందు కో ప్రభో‖ వందనం ‖
Verse
ఇన్ని నాళ్లు ధరను మమ్ముఁ బ్రోచియుఁ గన్న తండ్రి మించి యెపుడు
గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము
లివిగో వందనం‖ వందనం ‖
Verse
ప్రాత వత్సరంపుఁ బాప మంతయుఁ బ్రీతిని మన్నించి మమ్ముఁ గావుము
నూత నాబ్దమనను నీదు నీతి నొసఁగు మా దాత క్రీస్తు నాధ రక్షకా‖ వందనం ‖
Verse
దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాళి తనువు దినము లన్నియు నీ
వొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ సేవకై యంగీకరించుమా వందనం‖ వందనం ‖
Verse
కోఁతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతిఁ బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుఁడా వందనం‖ వందనం ‖
Verse
మా సభలకు పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నంధకార మంతఁ ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము వందనం‖ వందనం ‖

Related Tags

WorshipThanksgivingNew Year