Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vandanam Neeke Vandanam Parishuddha Shirama

వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమ

Vandanam Neeke Vandanam Parishuddha Shirama

Lyricist: Ravuri David
Chorus
వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం
వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె‖ వందనం ‖
Verse
సుందరుఁడ నీ శిరసు హేళనఁ బొందె ముండ్ల కిరీట ముంచగ
నెందుఁ జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా
మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్నుఁ గొలిచెద
నందముగ మహిమ ప్రభువా‖ వందనం ‖
Verse
భీకరుఁడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి
నుమి వేయఁబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు
భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము‖ వందనం ‖
Verse
మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ
గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా
నాలో చించఁగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి
పోయెను మరణ బలమున‖ వందనం ‖
Verse
సిలువ యెదుటను నిపుడు నేనిఁక నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా
ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక
పిలిచెద నిన్నేఁ గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా
యేసు నినుఁ జేతులతో నాపెద‖ వందనం ‖
Verse
నిన్ను నేఁ గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విఁక ని న్నెటుల
నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నునిఁ
జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే‖ వందనం ‖
Verse
మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగఁ గృపతో
వరబలుండా నా విరోధుని కరకు శరములఁ ద్రుంచ రావె శూరుఁడా
దేవకు మారుఁడా అటు నీ మరణ రూపము సిలువపై నా
తరుణమునఁ జూపుము యెహోవా‖ వందనం ‖

Related Tags

WorshipPassionSuffering