Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vandanam Vandanam Vandanam Deva Vandanam

వందనం వందనం వందనం దేవా వందనం

Vandanam Vandanam Vandanam Deva Vandanam

Lyricist: Raj Prakash Paul
Verse
వందనం వందనం వందనం దేవా వందనం
సర్వోన్నతుడా మహిమోన్నతుడా మహాఘనుడా వందనం
నీవే త్రిత్వం నీవే నిత్యం ఇదే సత్యం వందనం
ప్రాణమా ఓ నా ప్రాణమా ప్రభువును మహిమపరచుమా
వందనం వందనం వందనం దేవా వందనం
Verse
తల్లి గర్భమునందు నేను నిర్మింపబడకముందే
నీ ప్రజలకు అధిపతిగ నన్ను నిర్మించుకొంటివే
గురి లేని గతి లేని దీన స్థితిలో నన్ను పిలిచి
అణిచి మలచి దీవించి హెచ్చించి నీ సేవకై నిలిపావే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేసే
మరణమైన జీవమైన క్రీస్తేసే
వందనం వందనం వందనం దేవా వందనం
Verse
అడుగు అడుగుగా క్రమ క్రమముగా విస్తరింపజేసావు
పలు విధముగ సువార్త పరిచర్య అందింపజేసావు
నింద అయినా వేదన అయినా తోడునిచ్చి నడిపావు
కష్టమైన నష్టమైన సహాయకుడిగా నిలిచావు
నీ రాక వరకు ఫలించే కృపను నిమ్మయా
నీ ఆత్మతో ప్రకటింతు నీ సువార్త సత్యమును
యేసే సత్య మార్గము యేసులో నిత్య జీవము
నిత్యము నే నిరతము యేసుతో జీవింతును

Related Tags

PraiseWorshipThanksgiving