Chorus
వందనమయ్యా యేసు నీకు వందనమయ్యా మా కోరిక లందియ్య
వయ్యా వందనమయ్య నీ సుందర పాదార విందములకు భక్తి వినతులు
గావింతు సందియంబులులేని పరమానందమున నీయందు డెందము
పొందుపడఁ జేయవె యెహోవా నందనా పాపేంధనాగ్ని‖ వందనమయ్యా ‖
Verse
నర దైవత్వములు రెండుగూడి పరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి
యందు లేశంబయిన దురితంబులేని యవతారము నెరవుగా దాల్చి
ధరణికి నేతెంచి నిరయార్హూలగు సర్వ నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము
విరివిగా పరుగెత్తఁ జేయుచు విమలమగు నీ ప్రాణరక్తము లరుదుగా
సమర్పణము ,చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ‖ వందనమయ్యా ‖
Verse
నీ పుణ్యమందు నమ్ముకొనెడి యే పాపియైన తక్షణమున శాపంబుఁ
బాసి త్రాణగలిగి నీ సజ్జనుండు కృపవానిని కాపాడుచుండు
దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి
నీ వయిందన భారమెల్లను మోపి యోపికనుండ నేర్చిన
పాపిపుణ్యండగుచు నాత్మను భవ్య సుఖ మఖిలంబుఁబడయును‖ వందనమయ్యా ‖
Verse
శమదమ ప్రేమ కృపా వినయ సద్గుణములనెడి భూషణముల
నిమిడియున్నట్టి తనువు దాల్చి క్రమముగానందు దైవత్వము
కనుపఱచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య సముదయమునకు
నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను
సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువుఁజంపి జీవించిన మహాత్మా‖ వందనమయ్యా ‖